CBN LETTER TO DGP: సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ వేధింపులను ఖండిస్తూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను అక్రమంగా అదుపులోకి తీసుకుని సీఐడీ వేధించిందని లేఖలో పేర్కొన్నారు. అర్ధరాత్రి గోడలు దూకి, తలుపులు పగలగొట్టి నోటీసుల పేరుతో బెదిరించారని మండిపడ్డారు.
కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి స్టేషన్‍లో బట్టలు లేకుండా కూర్చోబెట్టి బాధితులపై దాడికి పాల్పడం దారుణమని ఆక్షేపించారు. విచారణ సమయంలో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీఐడీ వ్యవహరించిందన్నారు. తెలుగుదేశం శ్రేణులపై బెదిరింపు చర్యలకు దిగుతూ, అక్రమంగా అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం సీఐడీ అధికారులకు ఏంటని ప్రశ్నించారు. నేరపూరితమైన కుట్రలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోని బాధితులకు అండగా నిలవాలని కోరారు.
ఇవీ చదవండి: