గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్దమైంది. నేడో, రేపో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన జారీ చేయనుంది. 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీకి గత కొన్నాళ్లుగా కసరత్తు జరుగుతోంది. గ్రూప్స్ సహా అన్ని ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేసిన నేపథ్యంలో పరీక్షా విధానానికి సంబంధించి టీఎస్పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత కోరింది. కమిషన్ ప్రతిపాదనల మేరకు వాటన్నింటినీ సవరిస్తూ పరీక్షా విధానానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం వైపు నుంచి టీఎస్పీస్సీకి రావాల్సిన వివరాలు, సమాచారం దాదాపుగా అందినట్లయింది. ఒకటి, రెండు శాఖాల నుంచి కొంత సమాచారం రావాల్సి ఉందని, మధ్యాహ్నంలోపు కమిషన్‌కు చేరుతుందని అంటున్నారు. దీంతో నోటిఫికేషన్ కు ముందు చేయాల్సిన కసరత్తు అంతా పూర్తవుతుంది. ఆ వెంటనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్దమైంది. దీంతో ఇవాళ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా కారణాల వల్ల ఆలస్యమైతే రేపు జారీ చేస్తారు. మొత్తం 503 పోస్టులతో గ్రూప్ వన్ భారీ నోటిఫికేషన్ వెలువడనుంది.
గ్రూప్-1 నియామక ప్రక్రియలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా మల్టీజోన్ల వారీగా ఒక్కో ఖాళీకి 50 మంది చొప్పున అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు విధివిధానాలు స్పష్టం చేసింది. ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు రద్దు చేసిన నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిపాదనలకు అనుగుణంగా కొన్ని సవరణలు చేశారు. టీఎస్పీఎస్సీ సవరణలను పొందుపరుస్తూ అన్ని అంశాలతో సాధారణ పరిపాలనాశాఖ వివరణాత్మక ఉత్తర్వును జారీ చేసింది.
ఇవీ చూడండి: