ETV Bharat / city

కరోనాపై ముందే అంచనా వేయాల్సింది: చాడ

కష్టమనిపించినా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి కోరారు. కొవిడ్​-19 వ్యాప్తి నివారణ కోసం కృషి చేస్తోన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పరిస్థితిని ముందే అంచనా వేసి ఉంటే ఇంత ప్రమాదం వచ్చి ఉండేది కాదన్నారు.

సునామీ కంటే భయంకరమైనది కరోనా
సునామీ కంటే భయంకరమైనది కరోనా
author img

By

Published : Mar 24, 2020, 5:33 PM IST

కరోనా వైరస్‌ను తరిమికొట్టడానికి ప్రజలందరూ సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి కోరారు. కొవిడ్​-19ను తేలికగా తీసుకోవద్దని... స్వీయ నియంత్రణతోనే అరికట్టగలమని పేర్కొన్నారు. కరోనా సునామీ కంటే భయంకరమైందని అభివర్ణించారు. కష్టమనిపించినా ప్రజలు ఇంటికే పరిమితం కావాలని సూచించారు.

కరోనా కట్టడికి ప్రాణాలకు తెగించి పనిచేస్తోన్న డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, పోలీసులు, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ సిబ్బందితోపాటు తదితరులందరికీ తమ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మార్చి మొదటి తారీఖు నుంచే విదేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ చేసి ఉంటే ఇంత ప్రమాదం వచ్చి ఉండేది కాదన్నారు.

సునామీ కంటే భయంకరమైనది కరోనా: చాడ

ఇవీ చూడండి: 'ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం.. కరోనాను కట్టడి చేద్దాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.