ETV Bharat / city

అగ్రికల్చర్​ యువ శాస్త్రవేత్తలకు సర్టిఫికెట్ల అందజేత - తెలంగాణ తాజా వార్తలు

త్వరలో కొత్తగా 240 మంది యువ అగ్రికల్చర్​ శాస్త్రవేత్తలు శిక్షణ కోసం రానున్నారని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల నార్మ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 37 మంది యువ శాస్త్రవేత్తలకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. ఆ శాస్త్రవేత్తలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రైతుల స్థానిక సమస్యలు, బాధలు తెలుసుకున్నారని ఆయన అన్నారు.

Certificates distributed for young scientists in naarm rajendranagar
అగ్రికల్చర్​ యువ శాస్త్రవేత్తలకు సర్టిఫికేట్లు ప్రధానం
author img

By

Published : Jan 2, 2021, 7:39 PM IST

అగ్రికల్చర్​ యువ శాస్త్రవేత్తలకు సర్టిఫికేట్లు ప్రధానం

సరికొత్త ఆలోచనలు, భాగస్వామ్యంతో యువత, పట్టభద్రులు వ్యవసాయంలోకి రావాలని అఖిల భారత వ్యవసాయ మండలి పూర్వ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్‌ఎస్ పరోడా కోరారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్​‌లో.. వర్చువల్ వేదికగా జరిగిన 111వ ఫౌండేషన్ కోర్స్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీసెస్ -ఫోకార్స్ శిక్షణ ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి 17 రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్-ఏఆర్‌ఎస్‌లో యువ శాస్త్రవేత్తలు ఉత్తీర్ణులయ్యారు. వివిధ రాష్ట్రాల్లో శాస్త్రవేత్తలుగా నియమితులైన తర్వాత నార్మ్‌లో ఫోకార్సు శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న 37 మందికి ఆయన సర్టిఫికేట్లు ప్రధానం చేశారు. 1994లో విజన్-2020 లక్ష్యాలతో మొదలై భారత వ్యవసాయ రంగంలో విద్యా బోధన, పరిశోధన, విస్తరణ, అభివృద్ధి వంటి అంశాల్లో పురోగతి సాధించిన క్రమంలో.. ఇక నుంచి విజన్-2030 లక్ష్యాలతో మరింత ముందుకెెళ్లాలని పరోడా తెలిపారు.

వాతావరణ మార్పుల నేపథ్యంలో నాణ్యమైన వండగాలు, నిల్వ, రవాణా, మార్కెటింగ్ లాంటి సవాళ్లు అధిగమించేందుకు యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలని ఆయన సూచించారు. జాతీయ స్థాయిలో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్‌ను థింక్ ట్యాంక్‌గా కేంద్రం గుర్తించిన దృష్ట్యా.. వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంపికైన ప్రతి ఒక్కరూ రాజేంద్రనగర్‌ నార్మ్‌లో మూడు నెలలు ఫోకార్స్ శిక్షణ పూర్తి చేసుకుని.. దేశ సేవలో నిమగ్నమవుతారని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు, నార్మ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్‌కే సోమ్, ఫోకార్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.బాలకృష్ణ, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : కేసీఆర్ ఫోన్: నాగిరెడ్డి పంటెట్టున్నది... విత్తనాలు ఎక్కడ తెచ్చినవ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.