Telangana mlc elections 2021: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సాఫీగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. అన్ని చోట్లా ఏర్పాట్లు బాగున్నాయన్నారు. భారీగా పోలింగ్ శాతం నమోదైందని వెల్లడించారు. ఐదు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందని సీఈఓ తెలిపారు.
Telangana mlc elections 2021 results: ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తామన్న శశాంక్ గోయల్.. ఈనెల 14న ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ఓట్ల లెక్కింపు ఉంటుందని... ఫలితాల అనంతరం విజయోత్సవాలకు అనుమతి లేదని శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.
MLC Elections 2021 Telangana: "స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. బందోబస్తుతో బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తాం. అభ్యర్థుల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్‌లు సీజ్చేస్తారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాల నిఘాతో పాటు, పోలీస్ బందోబస్తు ఉంటుంది. అభ్యర్థులకు అనుమానాలు ఉంటే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కాపలా ఉంచుకోవచ్చు. కౌంటింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 14న ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం అవుతుంది. అందరి సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లు తెరుస్తారు. తొలి విడతలో బ్యాలెట్ పేపర్లను బండెళ్లుగా కడతారు. రెండో విడతలో పూర్తిస్థాయి లెక్కింపు ఉంటుంది. తొలుత మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక గెలిచిన అభ్యర్థిని ప్రకటిస్తారు. ఎన్నికల ఫలితాల అనంతరం గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు చేయరాదు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ ఉంటుంది."
- శశాంక్ గోయల్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
ఇవీ చూడండి: