ETV Bharat / city

Central Team Met CM Jagan: సీఎం జగన్​తో కేంద్ర బృందం.. వరద నష్టంపై చర్చ

ఏపీలో వరద నష్టం అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం.. సీఎం జగన్​తో(Central Team Meet CM Jagan) సమావేశమైంది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలోని పరిస్థితులపై ముఖ్యమంత్రి చర్చించారు. వరదల ధాటికి పంట నష్టం బాగా జరిగిందని.. కేంద్ర బృందం తెలిపింది. ఈ సమావేశంలో మాట్లాడిన సీఎం.. ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు సడలించాలని కేంద్ర బృందాన్ని కోరారు.

Central Team Meet CM Jagan
సీఎం జగన్​తో కేంద్ర బృందం భేటీ
author img

By

Published : Nov 29, 2021, 3:47 PM IST

Central Team Met AP CM Jagan: ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్‌తో కేంద్ర బృందం సమావేశం(Central Team Meet CM Jagan) ముగిసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై ఈ భేటీలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మూడ్రోజులు పర్యటించామని(Central team visits flood-hit areas in Andhra Pradesh).. వరదల వల్ల కడప జిల్లాకు భారీ నష్టం జరిగిందని కేంద్ర బృందం సభ్యుడు కునాల్‌ సత్యార్థి చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి అందజేశారు.

72శాతం నష్టం

వరదల ధాటికి పంటలు కొట్టుకుపోయాయని, పశువులు చనిపోయాయని కేంద్ర బృందం(Central team report on flood hit areas in Andhra Pradesh) ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు బాగా దెబ్బతిన్నాయని.. అన్నమయ్య ప్రాజెక్టు తెగిన చోట అపార నష్టం జరిగిందని పేర్కొంది. మొత్తం వరద నష్టంలో.. 40 శాతం వరకు రోడ్లు, భవనాల ధ్వంసం రూపంలో జరిగిందని నివేదికలో ప్రస్తావించింది. 32 శాతం నష్టం.. సాగు, అనుబంధ రంగాల్లో జరిగిందని.. వీలైనంత మేర ఆదుకునేందుకు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది.

వెంటనే నిధులు ఇచ్చేలా చూడండి - సీఎం జగన్
వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి జగన్ ధన్యవాదాలు(cm jagan on flood affected areas) తెలిపారు. ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించాలని కోరారు. నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో సమర్థ వ్యవస్థ ఉందని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ ఆర్‌బీకే కేంద్రం, ప్రతీ రైతు పంట ఇ–క్రాప్‌లో నమోదవుతుందని వివరించారు. ఇ–క్రాప్‌నకు సంబంధించి రైతుకు రశీదు కూడా ఇచ్చామని వెల్లడించారు.

కొవిడ్​ వల్ల నిధులు ఖాళీ

కొవిడ్‌ నివారణ చర్యల వల్ల ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధులు(cm jagan on State Disaster Response Funds) నిండుకున్నాయని గుర్తు చేసిన ముఖ్యమంత్రి.. వెంటనే అడ్‌హాక్‌ ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. విపత్తుల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి.. ప్రస్తుతమున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమం చేపట్టామని వివరించారు. ఆటోమేటిక్‌ వాగర్‌ గేజ్‌ సిస్టంపైనా దృష్టిపెడతామని చెప్పారు.

'ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించాలి. నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో సమర్థ వ్యవస్థ ఉంది. ప్రతి గ్రామంలో ఆర్‌బీకే ఉంది, ప్రతి రైతు పంట ఇ–క్రాప్‌లో నమోదైంది. ప్రతి రైతుకు పంట ఇ–క్రాప్‌ రసీదు ఇచ్చాం. కొవిడ్‌ చర్యల వల్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు నిండుకున్నాయి. వెంటనే అడ్‌హాక్‌ ప్రాతిపదికన నిధులివ్వండి.విపత్తుల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుత కాల్వల సామర్థ్యం పెంచేందుకు చర్యలు చేపట్టాం' - ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

ఇదీ చదవండి: Telangana Cabinet Meeting: కొనసాగుతున్న కేబినెట్​.. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, కొవిడ్​పై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.