మోదీ ప్రభుత్వం దేశ పౌరులందరికి ఇంధన భద్రతను ఇవ్వాలనుకుంటోందని కేంద్ర పెట్రోలియం, సహయవాయువు, స్టీల్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. హైటెక్ సిటీ సైబర్ టవర్స్‌లో ఇండియన్ ఆయిల్ రిమోట్ మానిటరింగ్, ఆపరేషన్ సెంటర్‌ను ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న వాతావరణ మార్పులు దృష్ట్యా సుస్థిరత, నెట్ జీరో ఇంధన పద్దతులకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. దీనికోసం డిజిటలైజేషన్ వంటి వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తున్నట్టు వివరించారు.
బీహెచ్ఈఎల్- జీఈ గ్యాస్ టర్బైన్ సర్వీసెస్‌లో ఏర్పాటైన ఈ డిజిటల్ సెంటర్ ద్వారా రిఫైనరీ గ్యాస్ టర్బైన్లను రిమోట్ పద్దతిలో నిర్వహణ, పర్యవేక్షణ చేయవచ్చని పేర్కొన్నారు. ఇది 27 ఇండియన్ గ్యాస్ ఆధారిత టర్భైన్లకు అనుసంధానమై ఉందని వెల్లడించారు. భారతదేశం గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ బృహత్తర లక్ష్యాన్ని పెట్టుకుందని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
ఇదీ చూడండి: ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు పూర్తి చేయండి: సీఎం