ETV Bharat / city

CS Service Extension: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ పదవీ కాలం పొడిగింపు

author img

By

Published : Jun 26, 2021, 9:43 PM IST

ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్ సర్వీసు 3 నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30తో ఆయన పదవీ కాలం ముగియనుండగా.. ప్రభుత్వ అభ్యర్థన మేరకు సెప్టెంబరు 30 వరకు పదవీకాలాన్ని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.

ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ పదవీ కాలం పొడిగింపు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సర్వీసును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్ధన మేరకు ఆదిత్యనాథ్ దాస్ సర్వీసును 2021 జులై 1 నుంచి సెప్టెంబరు 30 వరకూ పొడిగిస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శి కుల్దీ​ప్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఏడాది జూన్ 30 తేదీతో ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండటంతో ఆయన సర్వీసును పొడిగించాల్సిందిగా.. ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనల్లోని రూల్ 16 (1) ప్రకారం మూడు నెలల పాటు సర్వీసు పొడిగిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది.

ఇదీ చదవండి: CM KCR: కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లేఅవుట్లు అనుమతించవద్దు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.