కేటీఆర్‌ను సీఎం చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కాదు... ముఖ్యమంత్రి చేసే వ్యక్తి మాట్లాడితే... తాను స్పందిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రీజనల్ ఔట్ రిచ్ బ్యూరో ఆధ్వర్యంలో కోవిడ్ -19 టీకా అవగాహన కార్యక్రమంలో భాగంగా... కోవిడ్ -19 టీకా అవగాహన వాహనాలు ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని... పాత్రికేయులు అడిగిన అంశంపై కిషన్ రెడ్డి స్పందించారు. ఎవరో ఏదో మాట్లాడితే... దానిపై స్పందించనని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: అందరికీ టీకా కావాలంటే ఇంకా సమయం పడుతుంది: కిషన్ రెడ్డి