హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఏడాదిన్నర నుంచి ఇంకా నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడం పట్ల ఆయన అసహనం ప్రదర్శించారు.
లబ్ధిదారులకు కేంద్రం వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. త్వరితగతిన ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి లేకపోవడం వల్లే.. నిర్మాణ పనులు జాప్యం కావడానికి కారణం అని ఆరోపించారు.
ఇదీ చదవండి: శ్రీశైలం ఘంటామఠంలో బయటపడ్డ బంగారు నాణేలు