ETV Bharat / city

'తెలంగాణ బాయిల్డ్​ రైస్​ కోటా పెంచినందుకు కృతజ్ఞతలు' - కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కృతజ్ఞతలు

Kishan Reddy Tweet: కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్​గోయల్​కు.. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రబీ సీజన్​కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకునే ఉప్పుడు బియ్యం కోటా పెంచటంపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

central minister kishan reddy conveyed thanks to piyush goyal

author img

By

Published : May 11, 2022, 8:39 PM IST

Updated : May 11, 2022, 9:20 PM IST

Kishan Reddy Tweet: రైతుల శ్రేయస్సే నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. 2020-21 రబీ సీజన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యంకు అదనంగా మరో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ తీసుకోవాలని ఏప్రిల్​ 28న కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు రాసిన లేఖపై సానుకూల స్పందన లభించిందని తెలిపారు.

తాను రాసిన లేఖపై కేంద్ర మంత్రి పీయూష్‌ స్పందిస్తూ.. మొత్తంగా 6.05 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ తీసుకోమని భారత ఆహార సంస్థ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్‌కు యావత్ తెలంగాణ రైతుల తరఫున కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ట్వీట్​ చేశారు.

ఇవీ చూడండి:

Last Updated : May 11, 2022, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.