కేసీఆర్, కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వీర్యం చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉన్న విషయం తెలిసే పోలింగ్ శాతం తగ్గించేందుకు ఎన్నికలు పెట్టారని ధ్వజమెత్తారు. జీహెచ్‌ఎంసీ పాలకవర్గం గడువు ఇంకా మూడు నెలలు ఉన్నా ఓటమి భయంతో ముందస్తుగా ఎన్నికలు నిర్వహించారని విమర్శించారు.
పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాల్సి ఉన్నప్పటికీ అధికార పార్టీ కనుసన్నల్లో నడిచిందని ఆక్షేపించారు. మజ్లిస్ పార్టీ నిశ్శబ్దంగా పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడిందన్నారు. రాబోయే రోజుల్లో తెరాస అరాచకాలు, అకృత్యాలను అడ్డుకుంటామన్నారు.
ఇదీ చూడండి: ఎన్నికలు సంక్రాంతి సమయంలో నిర్వహించాలనుకున్నారు: బండి