దేశ ప్రజలందరికీ టీకా ఇచ్చేలా ఉత్పత్తిని పెంచేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలోని సంస్థలతో పాటు విదేశీ కంపెనీలతోనూ ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. టీకా ఉత్పత్తిలో కంపెనీలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు.
డిసెంబరు వరకు 259 కోట్లకు పైగా డోసులు ఉత్పత్తి చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో కేంద్రం అధీనంలోని రైల్వే, ఈఎస్ఐ, కంటోన్మెంట్, మిలటరీ భవనాలను ఆస్పత్రులుగా తయారు చేస్తున్నామని వెల్లడించారు. కేంద్రం పంపించిన వెంటిలేటర్లను రాష్ట్ర ప్రభుత్వ వినియోగించలేదన్న కేంద్రమంత్రి.... అనుభవం లేని సిబ్బందితో వినియోగిస్తే పరికరాలు పాడైపోవా అని ప్రశ్నించారు.
- ఇదీ చదవండి : ఆ రాష్ట్రాల్లో 67శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి