ETV Bharat / city

ఎర్రబెల్లికి కేంద్రమంత్రి కటారియా ఫోన్​.. - మంత్రి ఎర్రబెల్లికి కటారియా ఫోన్​

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు కేంద్ర జలశక్తి మంత్రి రతన్​లాల్​ కటారియా ఫోన్​ చేశారు. కరోనా వైరస్ తాజా పరిస్థితి, వైరస్​ ప్రభావం, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వేసవిలో మంచినీటి వసతిపై ఆరా తీశారు. వీటన్నింటి గురించి ఎర్రబెల్లి వివరించగా.. రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయంటూ కేంద్రమంత్రి అభినందించారు.

Central Minister kataria phone
ఎర్రబెల్లికి కేంద్రమంత్రి కటారియా ఫోన్​..
author img

By

Published : May 18, 2020, 4:02 PM IST

కేంద్ర జలశక్తి అభియాన్ మంత్రి రతన్ లాల్ కటారియా రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఫోన్ చేశారు. కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా ఉందని కేంద్రమంత్రి అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేతమైన చర్యలు అద్భుతంగా పని చేస్తున్నాయన్నారు. కరోనా వైరస్ తాజా పరిస్థితి, వైరస్​ ప్రభావం, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మంచినీటి వసతులు బాగున్నాయా అని ఆరాతీశారు. కేంద్ర మంత్రి అడిగిన అన్ని ప్రశ్నలకు ఎర్రబెల్లి సమాధానమిచ్చారు.

కొన్నిచోట్ల మాత్రమే..

కేవలం హైదరాబాద్​లో మాత్రమే ప్రస్తుతం 40కి అటుఇటుగా కేసులు నమోదవుతున్నాయని, గ్రామాల్లో జిల్లాల్లో దాదాపు కరోనా కేసులు లేవని కేంద్రమంత్రికి వివరించారు. హైదరాబాద్‌లోని కొన్నిచోట్ల మాత్రమే రెడ్‌ జోన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలు, మండలాలు ఆరెంజ్‌, గ్రీన్ జోన్లుగానే ఉన్నాయన్నారు. రెడ్ జోన్లలో కంటైన్‌మెంట్ కూడా నిర్వహిస్తున్నామని దయాకర్‌రావు పేర్కొన్నారు. మిష‌న్ భ‌గీర‌థ మంచినీరు ఇంటింటికీ న‌ల్లాల ద్వారా అందుతుందని స్పష్టం చేశారు.

కొరత రాకుండా..

వేసవిలోనూ మంచినీటికి ఎలాంటి కొర‌త రాకుండా చూస్తున్నామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి ర‌త‌న్ లాల్ క‌టారియా మాట్లాడుతూ, ఈ విష‌యాలు తాము కూడా విన్నామ‌ని, ఎప్పటిక‌ప్పుడు దేశ ప‌రిస్థితిని తెలుసుకుంటున్నామని, అందులో భాగంగానే తెలంగాణ వివ‌రాలు అడిగామ‌ని చెప్పారు.

ఇవీ చూడండి: 'కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రాలు నీరుగార్చొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.