ETV Bharat / city

Central On Polavaram: నిర్ణీత గడువులోగా పూర్తి కావడం అసాధ్యం: కేంద్రం

author img

By

Published : Dec 6, 2021, 6:16 PM IST

నిర్దేశించిన గడువులోగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం అసాధ్యమని కేంద్రం తేల్చి చెప్పింది. ప్రాజెక్ట్ పనుల్లో ఆలస్యం నిజమేనని వెల్లడించింది. రాజ్యసభలో ఏపీ తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

Central On AP project
పోలవరం పనుల్లో జాప్యం నిజమేనన్న కేంద్ర జలశక్తి శాఖ

Central Govt On Polavaram: నిర్ణీత గడువులోగా ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం అసాధ్యమని కేంద్రం స్పష్టం చేసింది. జలాశయ పనుల్లో జాప్యం నిజమేనని కేంద్ర జలశక్తి శాఖ తేల్చింది. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ లిఖితపూర్వక జవాబిచ్చారు. పునరావాసం, పరిహారంలోనూ జాప్యం జరుగుతోందన్న మంత్రి.. సాంకేతిక కారణాలతో పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు.

central minister on polavaram: వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నామన్న మంత్రి.. పోలవరం స్పిల్‌వే ఛానల్ 88 శాతం, అప్రోచ్ ఛానల్ ఎర్త్​వర్క్ పనులు 73 శాతం, పైలట్ ఛానల్ పనులు 34 శాతం మాత్రమే పూర్తైనట్లు తెలిపారు. ఇక పోలవరం సవరించిన అంచనాలు రూ.55,548.87 కోట్లకు టీఏసీ ఆమోదించిన మాట నిజమేన్నారు. అయితే.. 2020 మార్చిలో ఆర్​సీసీ ఇచ్చిన నివేదికలో పోలవరం సవరించిన అంచనాలకు రూ.35,950.16 కోట్లకు మాత్రమే అంగీకరించిందని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.