పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ డీపీఆర్ తమ వద్ద పెండింగ్‌లో లేదని కేంద్రం స్పష్టం చేసింది. 2005-06 ధరల ప్రకారం రూ.10,151.04 కోట్లతో డీపీఆర్ ఆమోదించారని స్పష్టం చేసింది. 2009 జనవరి 20 తర్వాత తమ వద్ద డీపీఆర్ పెండింగ్‌లో లేదని వెల్లడించింది. 2009 జనవరి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సవరించిన డీపీఆర్ రాలేదని జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు.
2005-06 ధరల ప్రకారం రూ.10,151.04 కోట్లతో డీపీఆర్ ఆమోదించారని స్పష్టం చేశారు. ప్రాజెక్టు వ్యయం సవరించిన అంచనాలను అడ్వైజరీ కమిటీ 2011, 2019లో ఆమోదించిందన్నారు. రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు.. జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమాధానం చెప్పారు.
ఇదీచూడండి: CM KCR Speech: 'సాగర్‌కు రూ.150 కోట్లు... ఆరునూరైనా దళితబంధు అమలు చేస్తాం'