ETV Bharat / city

Central Government : '2021-22లో ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయబోం'

రాబోయే నాలుగేళ్లకు సరిపడా ఉప్పుడు బియ్యం నిల్వలు ఉండటం వల్ల 2021-22లో ఈ బియ్యం కొనుగోలు చేయమని కేంద్రం(Central Government) స్పష్టం చేసింది. దీని ప్రభావం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై పడనుండటం వల్ల తెలంగాణ, ఏపీలకు ప్రత్యేకంగా తెలిపింది.

ఉప్పుడు బియ్యంపై కేంద్రం ఆదేశాలు
ఉప్పుడు బియ్యంపై కేంద్రం ఆదేశాలు
author img

By

Published : Sep 7, 2021, 6:38 AM IST

ఉప్పుడు బియ్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం(Central Government) తేల్చిచెప్పింది. వచ్చే మూడు నాలుగేళ్లకు సరిపడా నిల్వలున్నాయని.. 2021-22లో ఏ రాష్ట్రం నుంచి కూడా ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం కొనుగోలు చేయబోమని పునరుధ్ఘాటించింది. ఈ విషయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యేకంగా తెలిపింది. ఈ ప్రభావం రెండు రాష్ట్రాలపై ఉన్నప్పటికీ ప్రస్తుతానికి తెలంగాణపైన తీవ్రంగా ఉండనుంది. వచ్చే రబీలో రైతులపై కూడా పడే అవకాశం ఉంది. ఖరీఫ్‌లో ధాన్యం, బియ్యం కొనుగోలుపై గత నెలలో భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ అధికారులతో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఇటీవల అన్ని రాష్ట్రాలకు పంపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఉప్పుడు బియ్యం కొనుగోలు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.

యాసంగిలో 90% ఆ బియ్యమే

సాధారణంగా తెలంగాణలో యాసంగి(ఎండాకాలం)లో పండించే రకంలో 90 శాతం ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా వినియోగిస్తారు. వానాకాలం (ఖరీఫ్‌)లో వచ్చే ధాన్యాన్ని సాధారణ బియ్యంగా మారుస్తారు.ప్రస్తుత కేంద్ర నిర్ణయం ప్రకారం తెలంగాణలో మిల్లింగ్‌ చేసే ఉప్పుడు బియ్యంలో సగం కూడా కొనే పరిస్థితి లేదు. అయితే గత రబీ సీజన్‌కు సంబంధించి ప్రస్తుతం మిల్లింగ్‌ అవుతున్న బియ్యంపై స్పష్టత రావాల్సి ఉంది. కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసేందుకు ఎఫ్‌సీఐ ఈ బియ్యాన్ని కొనుగోలు చేసేది. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో స్థానికంగా కొంత ఉత్పత్తి పెరడగంతో ఉప్పుడు బియ్యాన్ని ఎఫ్‌సీఐ ఆమోదించే పరిస్థితి లేదని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే రాష్ట్రాలకు పంపిన సమావేశ మినిట్స్‌లో పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఇక అదనంగా కొనలేమని చెప్పడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి సాధారణ బియ్యం తప్ప ఉప్పుడు బియ్యం తీసుకోబోమని పేర్కొన్నారు. ఎగుమతికి ఉపయుక్తంగా ఉండే రకాల ధాన్యాన్ని పండించేందుకు ఆయా రాష్ట్రాలు ప్రాధాన్యమివ్వాలన్నారు.

రక్తహీనత, పోషకాహార లోపాలకు నియంత్రించే వాటిని సాగుచేయాలన్నారు. పంట మార్పిడికి రైతులను సమాయత్తం చేసేలా రాష్ట్రాలు ప్రోత్సాహకాలందించాలని.. పప్పుదినుసులు, నూనెగింజల సాగును పెంచాలని సూచించారు. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ప్రస్తుత సీజను నుంచి ధాన్యం సేకరణ నిబంధనల్లోనూ మార్పులు చేసింది. ధాన్యంలో 25 శాతం వరకు నూకలను అనుమతించేది. తాజాగా ఈ శాతాన్ని 20కి తగ్గించింది. రబీ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చకపోతే ఇది కూడా సమస్య కానుంది.

కేంద్ర స్పందన కోసం ఎదురుచూపు

తెలంగాణలో గడిచిన యాసంగిలో 91.63 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండింది. వాటి నుంచి 62.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం వస్తాయి. 24.75 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే తీసుకుంటామని.. మిగిలింది సాధారణ బియ్యంగా ఇవ్వాలని ఎఫ్‌సీఐ కోరింది. ఇప్పటి వరకు 16 లక్షల మెట్రిక్‌ టన్నులను ఎఫ్‌సీఐకి మిల్లర్లు అందజేశారు. యాసంగిలో వచ్చే ధాన్యం ఉప్పుడు బియ్యానికే ఉపయుక్తంగా ఉంటుందని.. 50 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉప్పుడు బియ్యంగా, మిగిలిన 12.75 లక్షల మెట్రిక్‌ టన్నులను సాధారణ బియ్యంగా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. ఎంత మేరకు స్పందన వస్తుందో వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇప్పటి వరకు 1.46 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకుంది.

ఖరీఫ్‌ సీజన్‌ సేకరణ ఖరారు

ప్రస్తుతం ఖరీఫ్‌సీజన్‌లో ధాన్యం సేకరణను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి 82 లక్షల మెట్రిక్‌ టన్నుల సాధారణ బియ్యాన్ని సేకరించాలని నిర్ణయించింది. తెలంగాణ నుంచి 40 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 42 లక్షల మెట్రిక్‌ టన్నులను ఎఫ్‌సీఐ సేకరించనున్నట్లు కేంద్రం పేర్కొంది. తెలంగాణలో ప్రస్తుత సీజన్‌లో 55 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని ప్రభుత్వ అంచనా. ఇప్పటి వరకు 45 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనుండగా 30 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు.

కేంద్ర నిర్ణయాన్ని రైతులకు చెబుతాం

" వచ్చే ఎండాకాలం నుంచి ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. పంట మార్పిడిని ప్రోత్సహించాలని ఇటీవల కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ కూడా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రైతులకు వివరిస్తాం. కేంద్రం తీసుకోకపోతే ఈ ధాన్యాన్ని పండించి ప్రయోజనం లేదు. ప్రస్తుత వానాకాలంలో సాధారణ బియ్యమే వస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు. వచ్చే ఎండాకాలం నుంచి రైతులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ నుంచి వచ్చిన తరవాత ఈ అంశంపై మంత్రులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది."

- గంగుల కమలాకర్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.