రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కేంద్ర బృందం సమావేశమైంది. కరోనా పరిస్థితులు, చికిత్స, సదుపాయాలు సంబంధిత అంశాలపై రాష్ట్ర అధికారులతో కేంద్ర బృందం సభ్యులు చర్చిస్తున్నారు. ఇప్పటికే గాంధీ సహా గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రులను కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ నేతృత్వంలో కేంద్ర సభ్యులు పరిశీలించారు. కొవిడ్ పరిస్థితిపై అంచనా వేసేందుకు ఎప్పటికప్పుడు కేంద్ర ఉన్నతాధికారులు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.
ఇప్పటికే మూడు సార్లు పర్యటించిన కేంద్ర బృందం... మరోసారి రాష్ట్రానికి వచ్చింది. నేటి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు.