ETV Bharat / city

ధరలు పెంచి మళ్లీ వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు : రేవంత్‌ రెడ్డి - Revanth Reddy on petrole rate hike

Revanth Reddy on TRS, BJP: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్‌, గ్యాస్ ధరలు సమన్వయంతోనే పెంచారని ఆరోపించారు. విద్యుత్ సంక్షోభానికి కారణం తెరాస ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 31 నుంచి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు

revanth reddy
revanth reddy
author img

By

Published : Mar 26, 2022, 6:50 PM IST

Updated : Mar 26, 2022, 7:28 PM IST

ధరలు పెంచి మళ్లీ వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు : రేవంత్‌ రెడ్డి

Revanth Reddy on TRS, BJP: పెట్రోల్, విద్యుత్​ ఛార్జీల పెంపును తెరాస, భాజపా కప్పిపుచ్చుకుంటున్నాయని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పేదలను దోచుకోవడమే పనిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.12 వేల కోట్లను రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ ప్రభుత్వం భారం మోపుతోందని అన్నారు. విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరల పెంపు సమన్వయంతోనే జరిగిందని చెప్పారు. గాంధీ భవన్​లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

'విద్యుత్ సంక్షోభం రావడానికి కారణం తెరాస ప్రభుత్వమే. ఉచితాల పేరుతో ఎన్నికల హామీలు ఇవ్వడం వల్లే... విద్యుత్ సంస్థలకు బకాయిలు ఏర్పడ్డాయి. కొంతమంది ప్రభుత్వంలో ఉన్న పెద్దమనుషులు విద్యుత్ బిల్లు ఎగవేత వల్ల 6 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఒక చేత్తో ఉచితం ఇస్తున్నాం అంటూనే... మరో చేత్తో విద్యుత్ భారం మోపుతోంది.' - రేవంత్ రెడ్డి

ఎన్నికలు ఉన్నప్పుడు డీజిల్, పెట్రోల్ ధరలు నాలుగున్నర నెలలు పెరగలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ఫలితాలు రాగానే మళ్లీ ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల కోసం మాత్రమే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగకుండా ఐదు నెలలపాటు ఆపారని అన్నారు. బీజేపీ కోణంలో జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం అని విమర్శించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచాయని... మళ్లీ వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

31వ తేదీన మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్యాస్ ధర పెంపుపై ఆందోళన చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీలకు అతీతంగా మహిళలందరూ పాల్గొనాలని కోరారు. అదే రోజు మండల, నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ ఏఈ, డీఈ ఆఫీస్​ల ముందు నిరసన తెలుపుతామని చెప్పారు. ఏప్రిల్ 4వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు... కేసీఆర్, మోదీ దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. 5వ తేదీన కలెక్టర్ కార్యాలయల ముందు నిరసన, ముట్టడి... 7వ తేదీన విద్యుత్ సౌధ, పౌర సరఫరా ఆఫీస్​ల ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి : 'వేల కోట్ల ప్రజాధనాన్ని కార్పొరేట్ కంపెనీలకు కేంద్రం దోచిపెడుతోంది'

Last Updated : Mar 26, 2022, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.