ETV Bharat / city

Amaravathi: ఏపీ రాజధాని అమరావతేనన్న కేంద్రం.. బడ్జెట్‌లో కేటాయింపులు

ఏపీ రాజధానిగా అమరావతినే పేర్కొంటూ బడ్జెట్‌లో కేంద్రం కేటాయింపులు చేసింది. ఏపీ విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించింది. కేంద్ర బడ్జెట్‌లో పట్టణాభివృద్ది శాఖ నుంచి ఏపీ రాజధానికి నిధులు ఇచ్చింది.

amaravathi
amaravathi
author img

By

Published : Mar 2, 2022, 6:37 PM IST

AP Capital: ఏపీ రాజధాని అమరావతి పేరుతో బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రొవిజన్‌ పెట్టింది. అమరావతినే రాజధానిగా పేర్కొంటూ.. ప్రాథమికంగా లక్ష రూపాయలు కేటాయించింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అమరావతిలో సచివాలయం, ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి నిధులు కేటాయించింది.

సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్‌కు రూ.1,126 కోట్లు, దానికి సంబంధించిన భూసేకరణకు రూ. 21 కోట్లు అవసరమని లెక్కగట్టింది. ఈ భూసేకరణకు రూ.18.3 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

300 ఏజీ స్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మాణానికి రూ.200 కోట్లు కావాలని అంచనా వేసింది. ఇక జీపీవోఏ భూసేకరణ వ్యయం రూ.6.69 కోట్లుగా లెక్క కట్టగా... 2020-21, 2021-22 బడ్జెట్ల ద్వారా రూ.4.48 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌ ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఇదీ చదవండి : పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్.. " అప్పుడే యుద్ధం చేస్తా"!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.