ETV Bharat / city

కేసుల దర్యాప్తుల్లో 'నేను సైతం' అంటోన్న నిఘానేత్రాలు

పోలీసులకు అత్యంత కీలకాస్త్రంగా సీసీ కెమెరాలు మారిపోయాయి. ఎంతటి క్లిష్టమైన కేసైనా... ఇట్టే సాక్ష్యాలందిస్తూ... పోలీసుల పనిని సులభం చేసేస్తున్నాయి. కొన్ని తప్పుదోవ పడుతున్న కేసులను సైతం అసలు నిజాలు బయటపెట్టి సరైన దారిలో నడిపిస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో 'నేనున్నాను... జాగ్రత్త...' అనే భయాన్ని నేరస్థుల్లో సీసీ కెమెరాలు కల్పిస్తున్నాయి.

author img

By

Published : Jan 30, 2021, 9:04 AM IST

cc cameras playing key role in case investigations

అటు నేర పరిశోధనల్లో ఆధారాలు అందిస్తూ, ఇటు ప్రమాద ఘటనల్లో కీలక రుజువులను అందించడంలో సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు చేపట్టిన ‘నేను సైతం’ సత్ఫలితాలనిస్తోంది. ఈ కార్యక్రమం కింద నివాస సముదాయాలు, వివిధ సంస్థలు, విద్యాలయాల వద్ద విస్తృతంగా ఏర్పాటుచేసిన కెమెరాలు ఎన్నో కేసుల్లో ఫుటేజీలను అందించి కేసుల తీరునే మార్చేశాయి. 2020లో కొన్ని సంఘటనలను ఛేదించడంలో ఇవి ఎలా దోహదపడిందీ మచ్చుకు పరిశీలిస్తే..

టిప్పర్‌ కాదు కారే..

వారంతంలో కారులో వెళ్తున్న వారిని టిప్పర్‌ ఢీకొట్టడంతో అయిదుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు. గచ్చిబౌలి ఠాణా పరిధిలోని విప్రో కూడలి వద్ద 2020 డిసెంబరు 13 తెల్లవారుజామున ఇది జరిగింది.. టిప్పరే ప్రమాదానికి కారణమని అంతా భావించారు. గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలి సమీప భవనం నుంచి సీసీ కెమెరా ఫుటేజీని తెప్పించారు. రెడ్‌ సిగ్నల్‌ ఉన్నా ఆగకుండా వేగంగా దూసుకొచ్చిన కారే టిప్పర్‌ని ఢీకొట్టిందని తేలింది.

నేరుగా బస్సు కిందకు దూసుకెళ్లి..

జీడిమెట్ల ఠాణా పరిధిలో 2019 డిసెంబరు 21న ఉదయం బస్సు ఢీకొని వి.నారాయణ చనిపోయారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ పుటేజీ పరిశీలిస్తే నారాయణ తనకు తాను బస్సు కింద పడే దృశ్యం కనిపించింది.

ఢీకొట్టకుండా ఉండేందుకు..

సెప్టెంబర్‌ 21.. బాచుపల్లి వీఎన్‌ఆర్‌ కళాశాల వద్ద ఓ ద్విచక్ర వాహనం డీసీఎం కింద పడింది. అందరూ తప్పు డీసీఎం నడిపే డ్రైవర్‌దే అనుకున్నారు. కళాశాల వద్ద ఉన్న సీసీ కెమెరాలు ఈ ప్రమాదంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. ఎదురుగా మూల మలుపు వద్ద సిగ్నల్‌ పట్టించుకోకుండా ఓ ట్రాక్టర్‌ రోడ్డు దాటినట్లు కనిపించింది. దానిని ఢీకొట్టకుండా ఉండేందుకు వాహనాన్ని నియంత్రించబోయి దంపతులు డీసీఎం కింద పడ్డారు.

చోరీ చేసింది పాత నేరస్థుడే..

అటు నిఘా నేత్రానికి ఇటు పోలీసు నేత్రం తోడయితే ఓ కేసుని ఎలా పరిష్కరించవచ్చో చెప్పిన ఘటన బాలానగర్‌ పరిధిలో చోటుచేసుకుంది. గతయేడాది జనవరి 20న ఓ ఇంట్లో రూ.4లక్షలను దొంగలు దోచేశారు. ఆ చోరీకి ముందు అటూ ఇటూ ఉన్న ఇళ్ల తాళాలూ పగలగొట్టి ఉన్నాయి. సీసీ కెమెరాల ఆధారాలు తప్ప ఇంకేం లేవు. అందులో ఓ యువకుడిని ఓ కానిస్టేబుల్‌ గుర్తించారు. ఓ పాత నేరస్థుడని, చోరీకి పాల్పడింది అతనేనని గుర్తించారు.
* బాచుపల్లి సామాజిక భవనం వద్ద ఓ ఇంట్లో దొంగతనం చేసిన ఐదుగురు సభ్యుల ముఠాని గుర్తించడంలో, గతేడాది అక్టోబర్‌లో కేపీహెచ్‌బీలోని ఓ ఆభరణాల దుకాణంలో చోరీని చేధించడంలోనూ సీసీ కెమెరాలే కీలకం.

ఇదీ చూడండి: కూతురిని చంపేసి.. నాలుక కోసి తినేసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.