ETV Bharat / city

'ఏపీ పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోయింది..' ట్విటర్​ వేదికగా బాబు ఆవేదన.. - చంద్రబాబు ట్విట్టర్

CBN On Power Cuts: ఆంధ్రప్రదేశ్​ చీకట్లోకి వెళ్లిపోయిందని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన చెందారు. విద్యుత్ కోతలతో ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల పరిస్థితి వివరిస్తూ.. ఓ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు.

cbn-shared-a-video-on-his-twitter-saying-that-the-state-has-gone-into-darkness

author img

By

Published : Apr 7, 2022, 7:12 PM IST

Updated : Apr 7, 2022, 7:30 PM IST

CBN On Power Cuts: ఏపీ పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోయిందని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల పరిస్థితి వివరిస్తూ ఓ వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. నాడు మిగులు విద్యుత్‌తో వెలుగులు నిండిన రాష్ట్రంలో.. నేటి ఈ చీకట్లకు కారణం ఎవరని నిలదీశారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో అనధికార పవర్ కట్‌లతో ప్రజలు అల్లాడిపోతున్నారని ధ్వజమెత్తారు.

విద్యుత్ సరఫరా లేక ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలు పడుతున్న బాధలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. భారీగా పెరిగిన కరెంట్‌ బిల్లులు ప్రజలు కిమ్మనకుండా కడుతున్నా ఈ కోతలు ఎందుకని నిలదీశారు. ఓవైపు కరెంట్ లేక ప్రజలు రోడ్డెక్కుతుంటే.. వాలంటీర్లకు సన్మానం అంటూ 233 కోట్ల రూపాయలు తగలేస్తూ పండుగ చేసుకుంటున్న ఈ ముఖ్యమంత్రిని.. నీరో కాక ఇంకేమనాలని మండిపడ్డారు. విద్యుత్ కోతలను ప్రశ్నించిన సామాన్య ప్రజలపై బెదిరింపులు మాని.. సమస్యను పరిష్కరించాలని హితవుపలికారు.

'ఏపీ పూర్తిగా చీకట్లో వెళ్లిపోయింది..' ట్విట్టర్​ వేదికగా బాబు ఆవేదన..

ఇదీ చదవండి :

Last Updated : Apr 7, 2022, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.