CBN on Foreign education: విదేశీ విద్యానిధి పథకానికి అంబేడ్కర్ పేరు తొలగించి.. తన పేరు పెట్టుకోవడం సీఎం జగన్ అహంకారమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇది ఆయనను అవమానించటమేనని అన్నారు. తెదేపా హయాంలో ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించామన్నారు. ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం ద్వారా బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ.15 లక్షలు ఈబీసీ, కాపు విద్యార్థులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు.
ఈ విధంగా ఐదేళ్ల కాలంలో.. 4,528 మంది విద్యార్థుల విదేశీ విద్యకు దాదాపు రూ.377 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోని వైకాపా ప్రభుత్వం అంబేడ్కర్ పేరును తొలగించడం ఆయనను అవమానించడమేనన్నారు. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే అంబేడ్కర్ పేరును చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-
విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే పేరు మార్చి అంబేద్కర్ పేరును చేర్చమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది తెలుగుదేశం(5/5)
— N Chandrababu Naidu (@ncbn) July 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే పేరు మార్చి అంబేద్కర్ పేరును చేర్చమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది తెలుగుదేశం(5/5)
— N Chandrababu Naidu (@ncbn) July 16, 2022విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే పేరు మార్చి అంబేద్కర్ పేరును చేర్చమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది తెలుగుదేశం(5/5)
— N Chandrababu Naidu (@ncbn) July 16, 2022
ఇవీ చదవండి: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్స్.. మహీంద్ర ఎస్యూవీలు అందించిన సంస్థ