మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసు ఛేదించడానికి రంగంలోకి దిగిన సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పులివెందులలోని వివేకా ఇంట్లో సీబీఐ అధికారులు సీన్ రీ కనస్ట్రక్షన్ చేశారు. హత్య జరిగిన రోజు ఏం జరిగి ఉంటుందన్న దానిపై సునిశిత పరిశీలన చేస్తున్నారు.
ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్నను ఘటనాస్థలికి తీసుకెళ్లి అధికారులు విచారించారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి, డ్రైవర్ ప్రసాద్, వంటమనిషి కుమారుడు ప్రకాశ్‌ను సీబీఐ విచారించింది. శనివారం నుంచి దర్యాప్తు మరింత వేగవంతం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.