CBI on CM Jagan Paris tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పారిస్ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. కుమార్తె కాలేజ్ స్నాతకోత్సవానికి వెళ్లేందుకు సీఎం జగన్ సీబీఐ కోర్టు అనుమతి కోరారు. పారిస్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. పారిస్ వెళ్లేందుకు జగన్‌కు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరారు. వివిధ కారణాలు చెప్పి జగన్ విదేశాలకు వెళ్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జగన్ పారిస్ వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షరెడ్డి పారిస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. పారిస్‌లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న హర్షరెడ్డి జులై 2న కాన్వొకేషన్ తీసుకోనున్నారు. కుమార్తె కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ సీబీఐ కోర్టును కోరారు. కుమార్తె కళాశాల స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు వీలుగా.. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈనెల 28 నుంచి వారం పాటు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. దీనిపై తాజాగా సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.
ఇవీ చూడండి..