ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణ వేగంగా జరుగుతోంది. వరుసగా 20వ రోజు సీబీఐ అధికారులు.. అనుమానితులను విచారణకు పిలిచారు. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో ఇద్దరు ఫోరెన్సిక్ వైద్యులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరు వివేకా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ రోజు మృతదేహం ఉన్న తీరుతో పాటు.. శరీరంపై గాయాలు, ఇతర విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
20 రోజులుగా నిరంతరాయంగా విచారణ కొనసాగిస్తున్న సీబీఐ అధికారులు.. ఘటనపై పూర్తి వివరాలు తేల్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. హత్య కేసులో అనుమానితులుగా భావిస్తున్న వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరి, వైకాపా కార్యకర్తలు, ఫైనాన్స్ ఉద్యోగి తదితరుల నుంచి ఇప్పటికే అధికారులు కీలక వివరాలను రాబట్టారు. ఇప్పుడు మృతదేహం ఆధారంగా హత్యోదంతాన్ని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.
ఇదీ చూడండి: Covaxin: సెప్టెంబర్ నుంచి పిల్లలకు కొవాగ్జిన్..!