మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్లోని కడప పట్టణంలో విచారణ చేపట్టగా.. రెండు రోజైన ఆదివారం.. వివేకా హత్యకు గురైన పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి నిశితంగా పరిశీలించారు. సోమవారం కూడా పులివెందుల నివాసంలో హత్య జరిగిన ప్రదేశాలను సీబీఐ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు
స్థానిక డీఎస్పీ వాసుదేవన్ కార్యాలయంలో సీబీఐ అధికారులు కేసు వివరాలపై ఆరా తీసింది. మరోవైపు అధికారులను కలిసేందుకు హైదరాబాద్ నుంచి పులివెందుల చేరుకున్నారు. వివేకా కుమార్తె సునీత, వివేకా సతీమణి సౌభాగ్యమ్మతో పాటు ఇతర కుటుంబసభ్యులను సీబీఐ విచారించింది.
ఇదీ చదవండి