ETV Bharat / city

viveka murder case: వివేకా హత్య కేసు... 16వరోజు కొనసాగుతోన్న విచారణ

ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 16వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ రోజు విచారణకు వైకాపా కార్యకర్త చిన్నపరెడ్డి హాజరయ్యారు.

వివేకా హత్య కేసు
వివేకా హత్య కేసు
author img

By

Published : Jun 22, 2021, 3:27 PM IST

ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీమంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 16వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో వైకాపా కార్యకర్త చిన్నపరెడ్డిని సీబీఐ అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. సీబీఐ అధికారులు గత కొద్ది రోజులుగా అనుమానితులను విచారిస్తున్నారు.

ఇప్పటికే ఈ కేసులో సీబీఐ అధికారులు వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని ఢిల్లీకి తీసుకెళ్లి విచారించారు. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి సీబీఐ అధికారులు ఇప్పటికే విచారించారు. వివేకాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, రాజకీయ పరమైన అంశాలన్నీ ఎర్ర గంగిరెడ్డి కనుసన్నల్లోనే జరిగేవనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో విచారణను వేగవంతం చేశారు.

సంబంధిత కథనాలు..

పులివెందులలో ​వివేకా ఇంటిని పరిశీలించిన సీబీఐ

Viveka murder case: 14వ రోజు విచారణ.. 8 మందిని ప్రశ్నిస్తోన్న సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.