ETV Bharat / city

డా.సుధాకర్ కేసులో సీబీఐ విచారణ.. వైద్యుల సమాధానాలు రికార్డు - డా సుధాకర్ కేసులో వైద్యులను సీబీఐ విచారణ

వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సీబీఐ బృందం.. సుధాకర్​కు వైద్యం అందిస్తున్న విశాఖ మానసిక ఆస్పత్రి వైద్యులను విచారించింది. డా.సుధాకర్​తో పాటు పోలీసుల సమాధానాలను సీబీఐ బృందం రికార్టు చేసింది.

డా.సుధాకర్
డా.సుధాకర్
author img

By

Published : May 30, 2020, 3:20 PM IST

నర్సీపట్నం వైద్యుడు సుధాకర్ కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. సుధాకర్​ చికిత్స పొందుతున్న విశాఖ మానసిక ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రాధ, చికిత్స అందించిన డా.రామిరెడ్డి ఇతర వైద్యులను సీబీఐ వేరువేరుగా ప్రశ్నించింది. మొత్తం ఆరుగురితో కూడిన సీబీఐ బృందం వేర్వేరు గదుల్లో ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని విచారించి.. వైద్యుల సమాధానాలను రికార్డు చేసింది.

దాదాపు 20 ప్రశ్నలు వేసి వాటి సమాధానాలు ఆధారంగా మిగిలిన విచారణ సాగించనుంది. డాక్టర్ సుధాకర్​ను కూడా విచారించి ఆయన వాదనను రికార్డు చేయనుంది. సీబీఐ ఎస్పీ నేతృత్వంలో విచారణ బృందం పనిచేస్తుంది. ఆసుపత్రి ప్రధాన గేట్లు మూసివేసి.. ఇతరులను లోపలికి అనుమతించడం లేదు. ఇతర రోగుల వద్ద సహాయకులు కూడా లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

డాక్టర్ సుధాకర్​ను లాఠీలతో కొట్టిన పోలీసులను కూడా సీబీఐ విచారించనుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారుల సమాచారాన్ని సీబీఐ సేకరించింది. సుధాకర్​ కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. కేసును సమగ్రంగా విచారించి... హైకోర్టుకు వివరాలు అందించనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.