YS Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్‌రెడ్డిని సీబీఐ.. కస్టడీ(CBI custody)కి కోరింది. ఈ మేరకు 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు శివశంకర్ రెడ్డి(Shivshankar Reddy custody) తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో శివశంకర్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సీబీఐ.. ఈ నెల 17న హైదరాబాద్‌లో ఆయనను అరెస్టు చేసింది.
హైదరాబాద్‌లో అరెస్ట్..
వివేకా హత్య కేసులో వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి(Shiva Shankar Reddy arrest)ని సీబీఐ.. నవంబరు 17వ తేదీన హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుంది. ఆయన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సన్నిహితుడు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి ఇటీవల ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకర్‌రెడ్డి ప్రస్తావన ఉంది. వివేకాను హత్యచేస్తే శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడంటూ ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి పేర్కొన్నారు. దీంతో ఈ నెల 15న కడపలో విచారణకు హాజరుకావాలని శివశంకర్‌రెడ్డికి సీబీఐ ఇటీవల సమాచారమిచ్చింది. అయితే అనారోగ్య కారణాలతో తాను హైదరాబాద్‌లో ఉన్నానని, తర్వాత వస్తానంటూ ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సీబీఐ ప్రత్యేక బృందం బుధవారం హైదరాబాద్‌లో ఆయనను పట్టుకుంది. ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించింది.
అనంతరం ఆయనను కడపకు తీసుకొచ్చేందుకు ట్రాన్సిట్ వారెంట్ కోసం నాంపల్లి మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టింది. అనంతరం ఆయనను పులివెందులకు తీసుకొచ్చి స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ వివేకా కుమార్తె సునీత(Viveka daughter Suneetha) గతంలో హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పొందుపరిచిన 15 మంది అనుమానితుల జాబితాలో శివశంకర్‌రెడ్డి ఒకరు. ఆయనపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Amaravati capital news: 'వికేంద్రీకరణే మా ప్రభుత్వ ఉద్దేశం, త్వరలో కొత్త బిల్లుతో వస్తాం..'