ETV Bharat / city

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు ఫైనాన్స్ ఉద్యోగి!

ఏపీ మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka murder case) దర్యాప్తులో సీబీఐ (CBI) వేగం పెంచింది. అనుమానితులను కడపకు పిలిపించి విచారణ కొనసాగిస్తోంది. పులివెందులకు చెందిన ఫైనాన్స్ ఉద్యోగి బాలు.. సీబీఐ విచారణకు ఇవాళ హాజరయ్యారు.

viveka murder case
మాజీ మంత్రి వివేకా హత్య కేసు
author img

By

Published : Jun 24, 2021, 6:53 PM IST

ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య (Viveka murder case) కేసులో 18వ రోజు సీబీఐ (CBI) విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అధికారులు.. అనుమానితులను విచారణ చేస్తున్నారు. పులివెందులకు చెందిన ఫైనాన్స్ ఉద్యోగి బాలు.. సీబీఐ విచారణకు ఇవాళ హాజరయ్యారు. బాలు ద్వారా అనుమానితులు భారీగా డబ్బులు రుణం కింద తీసుకుని ఉంటారనే సమాచారం మేరకు సీబీఐ ఆరా తీస్తోంది. అనుమానాలను నివృత్తి చేసుకోవటానికే అధికారులు బాలును భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు... కడప నుంచి పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారుల బృందం మరోసారి వివేకా ఇంటిని పరిశీలించింది. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతతో బృంద సభ్యులు చర్చించారు.

విచారణ వేగవంతం..

వివేకా హత్య కేసులో సీబీఐ (CBI) అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే వివేకా (Viveka) మాజీ డ్రైవర్‌ దస్తగిరిని విచారించారు. ఇతను వివేకా హత్య జరగడానికి ఆరు నెలల ముందు డ్రైవర్‌ పని మానుకున్నాడు. వివేకా వద్ద ఎందుకు పని మానుకోవాల్సి వచ్చిందనే కోణంలో అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. దస్తగిరిని దిల్లీకి తీసుకెళ్లిన అధికారులు రెండు నెలల పాటు అక్కడే ప్రశ్నించారు. ఇప్పుడు వరుసగా విచారణకు పిలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: iPhones seized: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 80ఐఫోన్లు సీజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.