CBI Inquiry on Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మరింత దూకుడు పెంచారు. వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో దిల్లీ నుంచి సీబీఐ డీఐజీ చౌరాసియా కడపకు వెళ్లారు. కడపలో సీబీఐ అధికారులతో ఆయన సమావేశమై కేసు పురోగతి పైన చర్చించినట్లు సమాచారం.
సీబీఐ వివేకా హత్య కేసులో ఇప్పటికే రెండు చార్జీషీట్లు కోర్టులో వేయడంతో పాటు ఐదుగురిని నిందితులుగా చేర్చింది. మరికొందరి ప్రమేయం పైన ప్రస్తావించిన తరుణంలో త్వరలో అరెస్ట్ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారి కడప కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ ఉన్నతాధికారి వారం రోజులపాటు జిల్లాలోనే ఉండి కేసు పురోగతిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.