ys Viveka Case: కడప పోలీసులు సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేయాలని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తనపై కడప పోలీసులు నమోదు చేసిన కేసును ఎత్తివేయాలని కోరుతూ రామ్ సింగ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఉదయ్ కుమార్‌ను ఏఎస్పీ బెదిరించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.
కేసు నేపథ్యం ఏంటంటే..
వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ తనను సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్ బెదిరిస్తున్నారని ఉదయ్ కుమార్ రెడ్డి కడప కోర్టును ఆశ్రయించారు. కడప కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు రామ్‌సింగ్‌పై 195ఏ, 323, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసును సవాల్ చేస్తూ సీబీఐ ఏఎస్పీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రామ్ సింగ్ వివేకా హత్య కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నారు.
ఇదీచూడండి: Viveka Murder Case: వివేకా హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు