ETV Bharat / city

సికింద్రాబాద్​లో భారీగా నగదు, ఆభరణాల చోరీ

సికింద్రాబాద్‌లోని ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 18 లక్షల నగదు, పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

సికింద్రాబాద్​లో భారీగా నగదు, ఆభరణాల చోరీ
author img

By

Published : Oct 22, 2019, 6:38 AM IST

Updated : Oct 22, 2019, 10:47 AM IST

సికింద్రాబాద్‌లో ఓల్డ్‌ బోయిన్‌పల్లిలోని మల్లికార్జుననగర్‌లో పట్టపగలే ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు 18 లక్షల రూపాయల నగదు, 3 కిలోల బంగారు ఆభరణాలు, 32 తులాల బంగారు బిస్కెట్లు, 7 కిలోల వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరళ అనే మహిళ డైలీ ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ... ఇద్దరు కుమారులు, కోడలితో కలిసి స్థానికంగా నివాసముంటోంది. కుమారుడిని బండి మీద దింపేందుకు మధ్యాహ్నం మూడున్నరకు వెళ్లి సాయంత్రం ఆరు గంటలకు వచ్చింది. ఇంటి తాళాలు తీసి దొంగతనం చేసినట్లు గమనించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బేగంపేట ఏసీపీ రాంరెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు ఆధారాలు, సాక్ష్యాలు సేకరించారు. తెలిసినవారే చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సికింద్రాబాద్​లో భారీగా నగదు, ఆభరణాల చోరీ

ఇదీ చూడండి: రామోజీరావుపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

TG_Hyd_09_22_Boinpally_Chori_AB_TS10017_TS10120 Contributer : S NAGARAJU Ph..9346919348 ( ) సికింద్రాబాద్‌ లోని ఓ ఇంట్లో పట్టపగలు దొంగతనం జరిగింది. దాదాపు 18 లక్షల రూపాయల నగదు, మూడు కిలోల బంగారు ఆభరణాలు, 32 బంగారు బిస్కెట్లు, 7 కిలోల వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయని బాధితురాలు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి లోని మల్లికార్జున నగర్ లో సరళ అనే మహిళ డైలీ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తూ తన కుమారులతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ప్రతి రోజు మాదిరిగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తన కుమారుడిని తీసుకురావడానికి ఇంటికి తాళం వేసి తిరిగి ఇంటికి సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో వచ్చిన్నట్లు ఆమె వివరించారు.అప్పటికే ఇంటి తాళాలు తీసి డబ్బు ఎక్కెడెక్కడ ఉన్న అన్ని ప్రాంతాల నుండి దాదాపు 18 లక్షల రూపాయలను దొంగలించుకుని పారిపోయారు. భారీ దొంగతనం తెలిసి వారే చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని బేగం పేట ఎసీపీ రాంరెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. దొంగతనానికి సంబంధించిన పలు సాక్ష్యాలను పోలీసులు సేకరించారు. దొంగతనం వెనుక ఇంటి వ్యక్తులున్నారా.., తెలిసిన వారున్నారనే కోణంలో ఇంట్లో వారి పని చేసేవారున్నారా, లేక బయట వారు ఎవరైనా వచ్చి చేశారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.. బైట్‌... సరళ, ఇంటి యాజమానిస బైట్‌... చంద్రశేఖర్‌, ఇన్‌స్పెక్టర్‌,
Last Updated : Oct 22, 2019, 10:47 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.