Case Filed on Ex minister Shabbir Ali :కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ సీపీ ఏకే ఖాన్‌పై కేసు నమోదైంది. ఏకే ఖాన్ కుమారుడు మోసిన్ ఖాన్‌పై కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసుక తవ్వకాల కోసం పెట్టుబడుల రూపంలో రూ.90 లక్షలు తీసుకున్నారని బాధితుడు అబ్దుల్ వాహబ్ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు.
Case Filed on former minister shabbir ali : అబ్దుల్ ఫిర్యాదుతో నాంపల్లి కోర్టు నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు షబ్బీర్ అలీ, ఏకే ఖాన్, అతడి కుమారుడు మోసిన్ ఖాన్‌పై కేసు నమోదు చేశారు.
'2016లో ఇసుక తవ్వకాల కోసం మోసిన్ ఖాన్ రూ. 90 లక్షలు తీసుకున్నాడు. ఖమ్మంలో 46 ఎకరాల్లో ఇసుక రీచ్‌ల కాంట్రాక్ట్ దక్కిందని నమ్మించాడు. ఐదేళ్లు గడిచినా లాభాలు ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా మాట దాటవేసేవాడు. కొన్నిరోజుల తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు.' అని బాధితుడు కోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.