హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావుపై హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోడలు సింధు శర్మను వేధించిన కేసులో 354 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జస్టిస్ నూతి రామ్మోహన్ రావుతో పాటు ఆయన భార్య, కుమారుడిపై పోలీసులు ఇది వరకే 498a కింద కేసు నమోదు చేశారు. తనపై భౌతిక దాడికి పాల్పడిన దృశ్యాలను జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కోడలు సీసీఎస్ పోలీసులకు నెల రోజుల క్రితం అందించారు.
![Case filed against Justice Nooti Rammohan Rao in CCS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4925859_82_4925859_1572587112528.png)