హైదరాబాద్ లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంపై దాడికి దిగిన భాజపా కార్పొరేటర్ల( BJP Corporators Attack On GHMC Office)పై పోలీసులు కేసు నమోదు(case on bjp corporators) చేశారు. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని కార్యాలయంలో చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయంలోని మేయర్ ఛాంబర్‌తో పాటు ఫర్నిచర్, పూలకుండీలను భాజపా నేతలు ధ్వంసం చేశారు.
ప్రజల ఆస్తిని ధ్వసం చేసినందుకు గానూ.. 32 మంది కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసులు నమోదు(police filed case on bjp corporators) చేశారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం కార్పొరేటర్లతో వచ్చిన భాజపా నాయకులు, కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేస్తామని సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి తెలిపారు. భాజపా కార్పొరేటర్ల దాడిపై మంత్రి కేటీఆర్(KTR Fire On BJP Corporators GHMC Attack) ఘాటుగా స్పందించారు. వారిపై చర్యలు తీసుకోవాలని... ట్విట్టర్ ద్వారా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్‌ను కోరారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
భాజపా కార్పొరేటర్ల దాడి..
జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంగళవారం రోజున భాజపా కార్పొరేటర్లు ఆందోళన(BJP corporators attack on GHMC office )కు దిగారు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ... మేయర్ ఛాంబర్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. ఈ క్రమంలో అక్కడున్న ఫర్నీచర్, పూలకుండీలను ధ్వంసం చేశారు. పోలీసులు వారిని ఎక్కడిక్కడ అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని, కార్పొరేటర్ల ఫండ్ విడుదల చేయాలని భాజపా కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. 5 నెలల క్రితం వర్చువల్ మీటింగ్ పెట్టినా... పనులు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదని కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని... లేదంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
సంబంధిత కథనాలు..