హైదరాబాద్‌ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. వందల కాలనీలను వరదనీరు ముంచెత్తింది. వరదలకు జంటనగరాలు చిగురుటాకులా వణికాయి. సికింద్రాబాద్ న్యూబోయిన్‌పల్లిలో వరద ఉద్ధృతికి కాలనీల్లోని కార్లు కొట్టుకుపోయాయి. వరద తాకిడికి ఒక కారుపై మరో కారు ఎక్కిన దృశ్యం అందరిని భయభ్రాంతులకు గురిచేసింది.
సెల్లార్ నిండిపోయింది... కారును తాళ్లతో లాగారు
నగరంలోని మణికొండలో గల ఓ అపార్ట్మెంట్లోని సెల్లార్ వర్షపు నీటితో నిండిపోయింది. పార్క్ చేసిన కార్లు సెల్లార్‌లోని నీటిలోనే మునిగిపోయాయి. స్థానికులు తాళ్ల సాయంతో కార్లను సెల్లార్ నుంచి బయటకు లాగారు.
పల్టీ కొట్టిన పడవ
హైదరాబాద్ పాతబస్తీ షాహీన్ నగర్లో భారీగా వరద నీరు చేరింది. బోటు సహాయంతో ఏడుగురిని సురక్షిత ప్రాంతానికి జీహెచ్ఎంసీ చేర్చుతుండగా... బరువు పెరిగి పడవ నీళ్లలో పల్టీ కొట్టింది. నీటిలో మునిగిన వారందరిని జీహెచ్ఎంసీ సిబ్బంది కష్టపడి కాపాడారు.
ఇవీ చూడండి: ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి.. కాపాడిన స్థానికులు