ETV Bharat / city

ఈటల కేసులో అధికారులు వేధిస్తున్నారంటూ హైకోర్టుకు కెనరా బ్యాంకు - జమునా హేచరీస్​ వార్తలు

ఏసీపీ, విజిలెన్స్​ అధికారులు వేధిస్తున్నారంటూ కెనరా బ్యాంకు హైకోర్టును ఆశ్రయించింది. ఈటల రాజేందర్​ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్​కు రుణం ఇచ్చినందుకు బ్యాంకు పనివేళల్లో వచ్చి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించింది.

CANARA BANK FILED CASE IN HIGH COURT
CANARA BANK FILED CASE IN HIGH COURT
author img

By

Published : May 22, 2021, 5:07 AM IST

మాజీ మంత్రి ఈటల కుటుంబానికి చెందిన జమునా హేచరీస్​కు రుణం ఇచ్చినందుకు విచారణ పేరుతో అధికారులు వేధిస్తున్నారని కెనరా బ్యాంకు హైకోర్టును ఆశ్రయించింది.

సర్వే పేరుతో అధికారులు వేధిస్తున్నారని.. జమునా హేచరీస్​, ఈటల రాజేందర్ భార్య, కుమారుడు దాఖలు చేసిన పిటిషన్​లో తమనూ ప్రతివాదిగా చేర్చాలని కోరింది. బ్యాంకు కీలక వేళల్లో ఏసీబీ, విజిలెన్స్ అధికారులు వచ్చి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని తన వ్యాజ్యంలో బ్యాంకు పేర్కొంది. ఉద్యోగుల ఫోన్లు సీజ్ చేయడం, వాట్సప్​లో వ్యక్తిగత మెసేజ్​లు చదవడం వంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించింది.

ఈ పిటిషన్​పై విచారణ చేపట్టిన హైకోర్టు.. జమునా హేచరీస్​ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చలేమని స్పష్టం చేసింది. ప్రత్యేకంగా వేరే పిటిషన్ వేసుకోవాలని సూచిస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

ఇవీచూడండి: రఘురామ ఎపిసోడ్: అరెస్టు నుంచి బెయిల్ వరకు ఇలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.