ఫార్మసీ, అగ్రికల్చర్, వెటర్నరీ తదితర కోర్సుల్లో నిర్వహించే ఎంసెట్ మొదటి పేపర్ పరీక్ష ప్రశాంతంగా పూర్తైంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో పరీక్ష జరగనుంది.
ఆలస్యమైతే పరీక్షకు అనుమతించమనే నిబంధన మేరకు... విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. మాస్క్, శానిటైజర్ ఉన్నవారినే అధికారులు లోపలికి అనుమతించారు.
ఇదీ చూడండి : పోలీసులే లక్ష్యంగా... నకిలీ ఖాతాలు, మోసాలు