ETV Bharat / city

ప్రగతిభవన్​ వద్ద కేబుల్​ ఆపరేటర్​ ఆత్మహత్యాయత్నం - ప్రగతి భవన్​ వద్ద కేబుల్​ ఆపరేటర్​ ఆత్మహత్యాత్నం

తన కేబుల్​ నెట్​వర్క్​ను రౌడీషీటర్​ ఆక్రమించాడని ఓ వ్యక్తి హైదరాబాద్​ ప్రగతి భవన్​ వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్​ సీసాతో వచ్చి బలవన్మరణానికి యత్నించిన అతణ్ని పంజాగుట్ట పోలీసులు అడ్డుకున్నారు.

ప్రగతిభవన్​ వద్ద కేబుల్​ ఆపరేటర్​ ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Nov 15, 2019, 1:32 PM IST

ప్రగతిభవన్​ వద్ద కేబుల్​ ఆపరేటర్​ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్​ ప్రగతిభవన్​ వద్ద మంచిర్యాలకు చెందిన కేబుల్​ ఆపరేటర్​ రవీంద్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రవీంద్రను అడ్డుకుని పంజాగుట్ట పీఎస్​కు తరలించారు. బాధితుడిని విచారించగా.. తన కేబుల్​ నెట్​వర్క్​ను రౌడీషీటర్​ ఆక్రమించాడని తెలిపాడు. పోలీసులు, ప్రజా ప్రతినిధులు, చివరకు ఎమ్మెల్యేకు తన సమస్య చెప్పినా.. పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎన్నో ఏళ్లుగా కేబుల్​నెట్​వర్క్​పై ఆధారపడి జీవిస్తున్న తనకు ఇప్పుడు ఆధారం లేకుండా పోయిందని వాపోయాడు. కుటుంబాన్ని పోషించేందుకున్న ఒక్కగానొక్క ఆధారం చేజారిపోయిందని ఆవేదన చెందాడు.

తన సమస్య పరిష్కారం కాకపోవడం వల్లే చనిపోదామని ఇక్కడకు వచ్చానని తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.