‘బురేవి’ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా తమిళనాడు తీరం రామనాథపురం జిల్లాకు దగ్గరగా ఉంది. ఉదయంలోపు ఇది మరింత బలహీనపడి ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉండిపోనుంది. ఇదివరకు భారత వాతావరణ విభాగ శాస్త్రవేత్తలు చెప్పిన దాన్నిబట్టి ఇది దక్షిణ తమిళనాడు, కేరళ మీదుగా వెళ్లి అరేబియా సముద్రంలో కలుస్తుందని అంచనా వేశారు. కానీ దీనికి భిన్నంగా తమిళనాడు తీరం దాటకమునుపే క్రమంగా బలహీనపడినట్లు శాస్త్రవేత్తలు శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్ ఆధారంగా తెలుస్తోంది.
దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో కొన్నిచోట్ల భారీవర్షాలు కురుస్తాయని అంచనాలు వేస్తున్నారు. నైరుతీ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంతో పాటు శ్రీలంక, లక్షద్వీప్, మాల్దీవులు, ఆగ్నేయ అరేబియా సముద్రంలో మత్స్యకారులకు హెచ్చరికలు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 24డివిజన్లపై వరద ప్రభావం.. సిట్టింగ్లకు చేదు అనుభవం