తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఐకాస ఇచ్చిన బంద్ పిలుపు మేరకు హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
- ఉప్పల్ డిపోలో 126 బస్సులు డిపోలోనే ఉండిపోయాయి. తెల్లవారుజామున వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పలేదు.
- మెహిదీపట్నం డిపో వద్ద 20 మంది డ్రైవర్లు, కండక్టర్లు కలిసి డిపో నుంచి బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతలో పోలీసులు వచ్చి వారిని అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
- ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రాష్ట్ర బంద్కు పిలుపునివ్వగా జీడిమెట్ల బస్ డిపో వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించారు. డిపో వద్దకు చేరుకున్న ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారికి సంఘీభావం తెలిపిన పలువురు రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారు.
- కూకట్పల్లి వద్ద ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. నిరసనలు చేసేందుకు వస్తున్న ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. డిపో వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండిఃకోదండరాం, ఎల్.రమణ అరెస్ట్..