బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో(palle prakruthi vanam) రాష్ట్రవ్యాప్తంగా ఆరు కోట్ల మొక్కలు నాటనున్నారు. ఈ పనులను ఉపాధి హామీ పథకం(నరేగా)తో అనుసంధానించడంతో రాష్ట్రవ్యాప్తంగా 2,725 వనాలలో సుమారు 1.36 కోట్ల పని దినాలు లభిస్తాయని అంచనా. ఈ వనాల్లో మొక్కలు నాటడం, వాటి కోసం గుంతలు తీయడం, భూమిని చదును చేయడం, ఆ తర్వాత నిర్వహణ రూపంలో పనులు లభిస్తాయి. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం, జీవవైవిధ్యం అభివృద్ధితోపాటు స్థానికులకు పెద్దఎత్తున ఉపాధి లభించనుంది.
రెండు రకాలుగా బృహత్ వనాలు
మండల కేంద్రాలు, పెద్దగ్రామాల్లో అందుబాటులో ఉన్న భూమి విస్తీర్ణం ప్రకారం ఒక బృహత్‌వనాన్ని 10 ఎకరాల్లో, మిగిలినవి 5-7 ఎకరాల్లో ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం పలుచోట్ల కార్యరూపం దాల్చింది. ఈ వనాలకు కావలసిన మొక్కలను గ్రామపంచాయతీ నర్సరీల నుంచి సేకరిస్తారు. సగటున 23 వేల చొప్పున 2,725 వనాల్లో నాటే మొక్కల సంఖ్య 6.26 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నవంబరు 9 వరకు భూముల్ని గుర్తించిన బృహత్ వనాల్లో(palle prakruthi vanam) అత్యధికంగా నల్గొండ జిల్లాలో 105, నిజామాబాద్‌లో 105.. అత్యల్పంగా మేడ్చల్‌లో 7, ఆసిఫాబాద్‌లో 15, యాదాద్రిలో 15 ఉన్నాయి.
భూముల అన్వేషణ..
పెద్ద విస్తీర్ణం కావడంతో ఈ వనాలు ఏర్పాటుకు భూముల లభ్యత సమస్యగా ఉంది. ఇంకా 1,113 మండల కేంద్రాలు, గ్రామాల్లో భూముల్ని గుర్తించి పనులు చేపట్టాల్సి ఉంది.
నీడనిచ్చేవి, పూలు, పండ్ల రకాలతో పాటు ఔషధ మొక్కల్ని బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో(bruhat palle prakruthi vanam) నాటనున్నారు. మధ్యలో వృత్తాకారంలో ముప్పావు ఎకరా విస్తీర్ణంలో పిల్లలకు ఆటస్థలం ఏర్పాటుచేస్తారు. దీని చుట్టూ నాలుగు వైపులా చతురస్రాకారప్రాంతాలుగా విభజించి మొక్కలు వేస్తారు. మధ్యలో, చుట్టూ నడకదారుల ఏర్పాటుతో పాటు ఫెన్సింగ్ చేసి వనానికి ప్రవేశమార్గం ఏర్పాటుచేస్తారు. ఇందుకు సాంకేతిక సహకారమిచ్చేది అటవీశాఖ(telangana forest department) కాగా ఏర్పాటు చేసేది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ.
ఒక్కో వనం(palle prakruthi vanam)లో కనీసం 20 రకాల మొక్కలు నాటాలని గ్రామీణాభివృద్ధిశాఖ స్పష్టం చేసింది. గతంలో గ్రామాల్లో అన్నిరకాల చెట్లుండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. దసరా వస్తే జమ్మి కోసం ఎక్కడెక్కడో తిరగాలి. బృహత్ పల్లె ప్రకృతి వనాలతో పలురకాల చెట్లు ఊర్లో ఒకేచోట పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఉసిరి, నేరేడు, టేకు, వెలగ, వేప, ఇప్ప, గంధపు మొక్క, రేగు, కుంకుడు, పనస, నెమలినార, తంగేడు, సీతాఫల్, దానిమ్మ, నిమ్మ, వెదురు, పారిజాతం, తిప్పతీగ వంటి మొక్కల్ని నాటాలని గ్రామీణాభివృద్ధిశాఖ పేర్కొంది. మొక్కల్ని గ్రామనర్సరీలోనే పెంచాలని..కొరత ఉంటే పొరుగు గ్రామం నుంచి తీసుకోవాలని సూచించింది. పచ్చదన ప్రాధాన్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆహ్లాదం కోసం ప్రభుత్వం ఈ బృహత్ పల్లె ప్రకృతి వనాలు(bruhat palle prakruthi vanam) ఏర్పాటు చేస్తోంది. చెట్ల సంరక్షణ పట్ల గ్రామస్థుల్లో బాధ్యత పెరుగుతుందని భావిస్తోంది.
పనిదినాలకు ఉపాధి వేతన రూపంలో చెల్లింపులు
- ఇదీ చదవండి : రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత