ETV Bharat / city

Road accident: నాలుగు రోజుల్లో పెళ్లి.. కానీ అంతలోనే విషాదం - నాలుగు రోజుల్లో పెళ్లి

మరో నాలుగు రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. బంధుమిత్రులతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఆర్తనాదాలు వినివిస్తున్నాయి. పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు.. కానరాని లోకాలకు చేరడంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

bride groom died
పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తూ వరుడు దుర్మరణం
author img

By

Published : Aug 23, 2021, 5:31 PM IST

మరో నాలుగు రోజుల్లో పెళ్లి. వివాహ వేడుకలు మెుదలయ్యాయి. ఇంకా పత్రికలు పంచాల్సి ఉంది. వాటి కోసం వరుడు పయనమయ్యారు. కానీ.. అదే అతని చివరి ప్రయాణం అవుతుందని ఊహించలేకపోయారు. శుభలేఖలు ఇవ్వడానికి బైక్ మీదవెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

పెళ్లి పత్రిక

పెళ్లి పత్రికలు పంచేందుకు బైక్​పై వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొని అనంతపురం జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డికి చెందిన మహేశ్‌ (26) మృత్యువాత పడ్డారు. ఎరుకులవాండ్లపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మహేశ్​కు ఈ నెల 27న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు కానరాని లోకాలకు చేరడంతో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చూడండి: MURDER: తండ్రినే హతమార్చిన కుమారుడు.. ఎందుకంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.