హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అరుదైన బ్రహ్మకమలం వికసించింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.78లో నివసించే జాజుల శైలజ, అప్పారావు దంపతుల నివాసంలో తొలిసారిగా ఈ బ్రహ్మకమలాలు విరిసాయి. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో ఈ కమలం విరియడంతో ఆయా కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారు ఆనందంలో మునిగి తేలారు. బ్రహ్మకమలానికి ప్రత్యేక పూజలు చేశారు. రెండున్నరేళ్లకే తమ ఇంటి ఆవరణలో పెట్టిన చెట్టుకు బ్రమ్మకమలం వికసించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: చిత్తు కాగితాలంటూ... ధ్రువపత్రాల అపహరణకు యత్నం