ETV Bharat / city

'మా బైక్​పై ఉచితంగా వెళ్లండి.. ఓటేసి రండి' - bounce free ride in ghmc polling

తమ ద్విచక్రవాహనాలపై ఉచితంగా వెళ్లి బల్దియా ఎన్నికల్లో ఓటు వేయండి అని ప్రముఖ అంకుర సంస్థ బౌన్స్​ ప్రకటించింది. బల్దియా పోలింగ్​ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ హైదరాబాద్​ ఇంఛార్జ్ శివ వెల్లడించారు.

Bounce Free Bike Ride Offer
బౌన్స్ ఉచిత బైక్ రైడ్ ఆఫర్
author img

By

Published : Nov 30, 2020, 6:42 PM IST

బల్దియా ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ల కోసం ప్రముఖ అంకుర సంస్థ బౌన్స్ ఓ ఆఫర్ ప్రకటించింది. పోలింగ్ రోజున ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు తమ ద్విచక్రవాహనంపై ఉచితంగా వెళ్లొచ్చని తెలిపింది. జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్​ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ హైదరాబాద్ ఇంఛార్జ్ శివ వెల్లడించారు.

1500 కేంద్రాల్లో ఐదువేల వాహనాలు అందుబాటులో ఉంచామని శివ తెలిపారు. ఏడాది నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్న బౌన్స్ సాధారణ రోజుల్లో..​ కిలోమీటరుకు రూ.3.50లకే తమ వాహనాన్ని వినియోగించుకునే అవకాశం కల్పిస్తోందని చెప్పారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్​ శాతాన్ని పెంచేందుకే ఉచితంగా ద్విచక్రవాహనాలపై వెళ్లే అవకాశం కల్పిస్తున్నామని శివ వెల్లడించారు. ఓటర్లు తమ ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి, తిరిగి పోలింగ్ స్టేషన్​ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఉచితంగా తమ వాహనాన్ని వినియోగించుకోవచ్చని బౌన్స్ నిర్వాహకులు తెలిపారు.

'మా బైక్​పై ఉచితంగా వెళ్లండి.. ఓటేసి రండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.