ETV Bharat / city

Vinod Kumar: 'కేంద్రానికి మనసుంటే మార్గం ఉండకపోదా?' - వినోద్ కుమార్ తాజా వార్తలు

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచేందుకు విభజన చట్టంలో వెంటనే సవరణలు చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

Vinodkumar
MP Vinod Kumar: కేంద్రానికి మనసుంటే మార్గం ఉండకపోదా?
author img

By

Published : Aug 3, 2021, 7:53 PM IST

తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. కేంద్రానికి(Central government ) మనసుంటే అసెంబ్లీ సీట్ల పెంపునకు మార్గం ఉండకపోదా అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Boinapally Vinod kumar) ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి (revanth reddy) ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని చెప్పడం... చూస్తుంటే పాత చింతకాయ పచ్చడి సమాధానం అని ఎద్దేవా చేశారు.

చిన్న సవరణ చాలు..

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 26వ సెక్షన్​లో స్వల్ప సవరణ చేస్తే స్థానాల సంఖ్య పెంచేందుకు అవకాశం ఉందన్న ఆయన... చిన్నసవరణతో సరిపోయే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు మొండిగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని అన్నారు.

విభజన చట్టం సవరణకు డిమాండ్

తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించినప్పటికీ విభజన చట్టంలో సవరణలు చేసి ఖమ్మం జిల్లాలోని ఏడుమండలాలను ఆంధ్రప్రదేశ్​లో కలిపారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. శాసనమండలి సీట్లను కూడా పెంచారని అన్నారు. అప్పుడు చట్ట సవరణకు మనసు వచ్చిన కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు కోరుతున్నప్పటికీ అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తాను పార్లమెంట్​లో ప్రైవేటు బిల్లు పెట్టానని, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించామని తెలిపారు. అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమేనని అప్పుడు న్యాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచేందుకు విభజన చట్టానికి సవరణ చేయాలని డిమాండ్ చేశారు. బేషజాలకు వెళ్లకుండా... పెద్ద మనస్సు చేసుకుని తక్షణమే శాసనసభ స్థానాల సంఖ్య పెంచాలని వినోద్ కుమార్ కోరారు.

కేంద్రం ఏం చెప్పిందంటే..?

తెలుగు రాష్ట్రాల్లో (Telugu states)నియోజకవర్గాల పునర్విభజన 2031 తర్వాతే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం (Central government ) స్పష్టం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల (Assembly constituencies) పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (tpcc chief revanth reddy) లోక్‌సభలో ప్రశ్న లేవనెత్తారు. 'ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు పెంచుతారు?' అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ (Union Minister Nityanand Rai) సమాధానం ఇచ్చారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని నిత్యానంద్ రాయ్ తెలిపారు. నియోజక వర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 నియోజక వర్గాలను 225కు పెంచుతారు. అలాగే తెలంగాణలోని 119 నియోజకవర్గాలను 153కు పెంచుతారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.