ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద పడవ ప్రమాదంలో గల్లంతైన వారిలో మరో మృతదేహం లభ్యమైంది. కడియపులంక వద్ద... గోదావరి ఒడ్డున స్థానికులు శవాన్ని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి... ఎముకలు బయటపడి ఉన్నాయి. గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉంది. మృతదేహం పక్కనే లైఫ్ జాకెట్ ఉంది. దీని ఆధారంగా బోటు ప్రమాదంలో గల్లంతైన వ్యక్తి మృతదేహంగా... పోలీసులు నిర్ధరణకు వచ్చారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండీ... ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల పదవి విరమణ 60 ఏళ్లు..!