ETV Bharat / city

భైంసా బాధితుల సహాయార్థం బండి సంజయ్ తులాభారం - భాజపా కార్యాలయంలో బండి సంజయ్ తులాభారం

భైంసా బాధితుల సహాయార్థం... భాజపా ఆధ్వర్యంలో తులాభారం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొని... తులాభారం ద్వారా లక్ష రూపాయలు అందించారు.

భైంసా బాధితుల సహాయార్థం బండి సంజయ్ తులాభారం

author img

By

Published : Sep 7, 2020, 10:26 PM IST

భైంసా బాధితుల సహాయార్థం బండి సంజయ్ తులాభారం

అన్ని వర్గాల ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. భైంసా బాధితుల సహాయార్థం జూబ్లీహిల్స్​ భాజపా నాయకుడు రఘురాజ్ గౌడ్... పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్​తో తులభారం చేపట్టారు.

భైంసా దాడుల్లో ఇప్పటికీ చాలా మంది నిలువ నీడ లేక చెట్లు, టెంట్ల కింద జీవనం సాగిస్తున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ప్రతిసారి హిందువులపై దాడులు జరుగుతున్నా... నిరోధించకుండా ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు.

హిందు యువకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని బండి సంజయ్ మండిపడ్డారు. భైంసాలో జరిగిన దాడి బయట ప్రపంచానికి తెలియకుండా.... మీడియాపై ఆంక్షలు విధించి, దోపిడీ దొంగలను పెంచి పోషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.